BIG BREAKING: ఏపీలో భూకంపం.. ఆ జిల్లాలో కంపించిన భూమి!
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.