/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
Earth Quake
ఆగ్నేయాసియా దేశాల ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
Terrifying Footage Shows Giant Buddha Trembling Before Mandalay Shrine Collapse
— The Irrawaddy (Eng) (@IrrawaddyNews) April 7, 2025
CCTV camera footage at the Mahamuni Pagoda in Mandalay captures the famous giant Buddha image trembling during the 7.7-magnitude earthquake on March 28, as pilgrims frantically run for their lives… pic.twitter.com/LW4ZANlxm8
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో..
సిమెయులు రీజెన్సీలోని సినాబాంగ్ నగరానికి ఆగ్నేయంగా 62 కి.మీ దూరం, సముద్ర మట్టానికి 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే మొదట ఈ భూకంపం 6.2 తీవ్రతతో నమోదైంది. ఆ తర్వాత 5.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
[INGV] M6.0 Apr-07 20:50:03 UTC, Northern Sumatera, Indonesia [Sea: Indonesia] , Depth:30.0km, https://t.co/Fnaaf9KHR6 #quake pic.twitter.com/zZ0DggeRR2
— Earthquakes (@earthquakesApp) April 7, 2025
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Sismo magnitud 5.6 en la Isla de Simeulue, cerca de la costa oeste de Sumatra, Indonesia. 27 km de profundidad. #earthquake pic.twitter.com/gROT3lVryF
— Centinela35 (@Centinela_35) April 7, 2025
ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!