/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
Earthquake in AP : ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోనూ స్వల్పంగా భూకంపం సంభవించింది. రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.భూమి కంపించిన సమయంలో భూమి లోపలపెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
నియోజవర్గంలోని దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాలలోనూ భూమి కంపించింది. ఉదయం 9.58 నుండి 10.00 మధ్య రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఏడాది కాలంలో జిల్లాలో పలుసార్లు భూమి కంపించింది. దగ్గరలోని గుండ్లకమ్మ.. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో నిత్యం పనుల కారణంగా ప్రకంపనలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ కోసం భారీగా బ్లాస్టింగ్ మెటీరియల్ ను వినియోగిస్తున్న కారణాంగానే భూమి కంపిస్తుందంటున్న స్థానికులు. భూమి లోపల వస్తున్న మార్పులు కారణంగా భూమి కంపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో ఇటీవల స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి.గత ఏడాది డిసెంబర్ లోనూ ప్రకాశం జిల్లాలో వరుస భూకంపాలు వచ్చాయి. డిసెంబర్ 21న జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. ఆ రోజు ఉదయం 10.24 గంటలకు ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, శంకరాపురం, వేంపాడులో మొదటగా సెకను పాటు భూమి కంపించింది. అనంతరం అదేరోజు రాత్రి 8.15, 8.16, 8.19 గంటల సమయాల్లో తాళ్లూరు మండలం విఠలాపురంతో పాటు ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, మారెళ్ల, పసుపుగల్లు, శంకరాపురం, వేంపాడు గ్రామాల్లో మరోసారి సెకను పాటు ప్రకంపనలు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
ఉదయం వచ్చిన ప్రకంపనలకు భయపడి తరగతి గదుల నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి సిబ్బంది బయటికి పరుగులు తీశారు. అలాగే ముండ్లమూరులోని ఆదర్శ పాఠశాలలో పై అంతస్తులో తరగతులు నిర్వహిస్తుంటారు. ఎక్కడ భూ కంపం మళ్లీ వస్తుందోననే భయంతో ఉపాధ్యాయులు చెట్ల కింద విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. అయితే అంతకు ముందు మూడు రోజులు నుంచి కూడా భూమి కంపించింది. జిల్లాలో మళ్లీ మళ్లీ భూ ప్రకంపనలు వస్తుండడంతో ఆయా గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా మరోసారి భూమి కంపించడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
అటు తెలంగాణలోనూ సోమవారం భూమి కంపించింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. సాయంత్రం సమయంలో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు జరిగాయి. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల స్వల్ప భూప్రకంపనలు జరిగాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో రెండు సెకన్ల పాటు ప్రకంపనలు జరిగాయి. దీంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్