Trump: వాళ్ళతో వ్యాపారం చేయము–ట్రంప్
వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే చట్టాలను కఠినతరం చేయనున్నారని తెలుస్తోంది.
వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే చట్టాలను కఠినతరం చేయనున్నారని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్నిరోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ ఆ బాధ్యతలు చేపట్టకముందే తాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తానని క్రిస్టోఫర్ రే పేర్కొన్నారు.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల భారతీయులకు ప్రయోజనం కలగనుందనే ప్రచారం నడుస్తోంది.
భారత సంతతికి చెందిన హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చండీగఢ్‌కు చెందిన ఈమె చిన్నతనంలోనే ఫ్యామిలీ అమెరికలో స్థిర పడ్డారు.
నాసా చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాన్ మస్క్‌కి వ్యాపార సహచరుడు అయిన జేర్డ్ నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ...వాటి పై 100 శాతం ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీ పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవినీతిని నిర్మూలించడానికి ఎంతో శ్రమించిన కశ్యప్ నియామకంతో ఎఫ్‌బీఐకి పూర్వ వైభవం తీసుకొస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
కాబోయే అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్‌సేత్‌పై తల్లి పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేసింది. 'అతనికి మహిళలంటే చాలా చిన్న చూపు. అమర్యాదగా ప్రవర్తిస్తాడు. తప్పుగా మాట్లాడుతాడు. మేము చాలా విసిగిపోయాం. నేను అతన్ని గౌరవించను' అని చెప్పింది.
మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.