Malawi Vice President: మరో ఘోర విమాన ప్రమాదం.. దేశ ఉపాధ్యక్షుడి దుర్మరణం!
మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.