సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం!

'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌నులు దాదాపు పూర్తికావొచ్చాయ‌ని సమాచారం. ఫస్టాఫ్ వరకు తమన్ బీజియం పూర్తి చేస్తే, సెకండాఫ్ దేవితో పాటూ అజ‌నీష్ లోక్ నాథ్‌, శ్యాం సి.ఎస్ వర్క్ చేశారట. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వెర్షన్స్ వైజ్ గా BGM చేయించారట.

New Update
sukuu

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప2' పై రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే అంచనాలను పీక్స్ కు చేర్చింది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలవగా.. త్వరలో స్పెషల్ సాంగ్ రానుంది. 

ఇదిలా ఉంటే 'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ దేవిని కాదని తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీ ఎస్ లను తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. ఆ వార్తలు నిజమేనని రీసెంట్ గా తమన్ క్లారిటీ ఇచ్చాడు. 'పుష్ప2'  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌నులు కూడా దాదాపుగా పూర్తికావొచ్చాయ‌ని సమాచారం. 

అసలు  ట్విస్ట్ ఇదే..

ఫస్టాఫ్ వరకు తమన్ బీజియం పూర్తి చేస్తే సెకండాఫ్ మాత్రం దేవితో పాటూ  అజ‌నీష్ లోక్ నాథ్‌, శ్యాం సి.ఎస్ వర్క్ చేశారట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సుకుమార్ ఓ ప్లాన్ తో ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో BGM వెర్షన్స్ వైజ్ గా చేయించారట. సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్ర‌సాద్ నేప‌థ్య సంగీతం అందించేశాడ‌ట‌. 

అది ఓ వెర్ష‌న్‌. త‌మ‌న్‌, అజ‌నీష్‌, శ్యాం సి.ఎస్ ఇచ్చింది మ‌రో వెర్ష‌న్‌. అంటే.. ఈ సినిమా కోసం ఇప్పటికే  రెండు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ల వెర్ష‌న్లు రెడీగా ఉన్నాయి. వీటిలో ఏది ఫైన‌ల్ అవుతుంద‌న్న‌ది సుకుమార్ డెసిషన్ పైనే డిపెండ్ అయి ఉంది. ట్రైల‌ర్ కు సైతం ఇలా మూడు వెర్ష‌న్లు చేయించాడట సుకుమార్. 

Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?

దేవికే సుకుమార్ ఓటు..

ఓ వెర్ష‌న్‌కి దేవిశ్రీ ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే, మ‌రో వెర్ష‌న్ కు త‌మ‌న్‌, ఇంకోదానికి శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చార్ట‌. చివ‌ర‌కి దేవిశ్రీ ఇచ్చిన వెర్ష‌న్ విడుద‌ల చేసినట్లు తెలుస్తోంది. రేపు సినిమా విషయంలోనూ సుకుమార్ ఫైనల్ ఛాయిస్ దేవినే కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్‌ ముందు పవన్‌ నథింగ్‌!

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు