Health Tips: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ
ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది బాధపడుతున్నట్లు తేలింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో చాలామంది సతమతమవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి డీలా పడిపోవడం, తర్వాత ఏం జరుగుతుందోనని భయపడిపోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు.