Depression: ‘నేను డిప్రెషన్లో ఉన్నాను’.. ‘చాలా డిప్రెసెడ్గా అనిపిస్తుంది’.. ‘నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను..’ ఈ మాటలు మన ఫ్రెండ్స్ లేదా తెలిసినవాళ్లు మనతోనే అంటుంటారు. నిజానికి చాలామందికి డిప్రెషన్ అంటే లవ్ ఫెయిల్ తర్వాత వస్తుందని.. అప్పుడు సినిమాలో హీరోగారు తాగినట్టు మందుతాగుతారని.. సిగెరట్లు శరీరంపై కాల్చుకుంటారని.. అవతలి వారికి హాని చేస్తారని అనుకుంటుంటారు. అయితే ఇదంతా నిజం కాదు. సినిమా హీరో ఎమోషనల్ ఎలివేషన్ కోసం అతని బాధను చూపించేందుకు ఇలా చేస్తుంటారు. దీనికి డిప్రెషన్ అని పేరు పెడుతుంటారు. నిజానికి డిప్రెషన్(Depression) ఓ మానసిక వ్యాధి. డిప్రెషన్ పోవడానికి థెరపీ లేదా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. కొంతమంది మందులు కూడా రిఫర్ చేస్తుంటారు. డాక్టర్ అనుమతి లేకుండా మానసిక సమస్యల గురించి ఎలాంటి మందులు వాడకూడదు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ఆంథోనీ(Vijay anthony) కూతురు మీరా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవడం అటు కోలివుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ సినీ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. 12వ తరగతి చదువుతున్న టీనేజర్ మీరా చిన్నవయసులోనే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకోని చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది.
పూర్తిగా చదవండి..Depression: డిప్రెషన్ అంటే సినిమాలో చూపించే తాగుబోతు క్యారెక్టర్ కాదు బాసూ.. అది వేరే..!
తమిళ నటుడు-కంపోజర్ విజయ్ ఆంథోనీ కుమార్తె మీరా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటివలి కాలంలో విద్యార్థులు ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నట్టు అధ్యయనలు చెబుతున్నాయి. కోపంగా ఉండడం, విచారంగా అనిపించడం, నిద్ర భంగం, ఆసక్తి కోల్పోవడం డిప్రెషన్‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలు మనకు ఎదురువుతాయి.
Translate this News: