Delhi Elections 2025: మనీశ్ సిసోడియా ఓటమి
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయారు. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో భావోద్వేగానికి గురైన ఓ కార్యకర్త వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కోండ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఇదిలా ఉండగా మొదటి బీజేపీ బోణీ కొట్టింది. విశ్వాస్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేసిన అభ్యర్థి ఓం ప్రకాశ్ శర్మ విజయం సాధించారు.
దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కొనసాగుతోంది. అయితే ఒకప్పుడు నాలుగు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఒక స్థానం కూడా గెలవడంలేదు. అమలు చేయలేని హామీలు, ప్రచారం చేయకపోవడం వంటివి కాంగ్రెస్ పతనానికి కారణాలని చెప్పవచ్చు.
ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీలో సీఎంను ఎన్నుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని చాలామంది నాయకులకు ఉంది. లిస్టులో ఉన్నది ఎవరో చూద్దాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లుగా చెప్పారు ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీది. తన జీవితంలో మొదటిసారిగా బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఓటు వేశారు.