Sajid Rashidi : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశా..  ముస్లిం మత పెద్ద సంచలన కామెంట్స్ !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లుగా చెప్పారు ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీది. తన జీవితంలో మొదటిసారిగా బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

New Update
sajid rashidi

sajid rashidi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లుగా చెప్పారు ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీది. తన జీవితంలో మొదటిసారిగా బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.  ముస్లింలు కూడా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే లౌకిక పార్టీలు అని పిలవబడేవి ఆందోళన చెందాలన్నారు. 

కాంగ్రెస్, స‌మాజ్‌వాదీ పార్టీ  పార్టీలు సెక్యులర్ ముసుగులో ముస్లిం ఓటు బ్యాంకును వాడుకుంటున్నాయని అని అన్నారు.  హిందూ ముస్లింలు ఏకం అవ్వకుండా విడదీస్తున్నాయని ఆయన ఆరోపించారు.  అందరినీ కలుపుకుని అభివృద్ధి చేసేవాళ్లే అసలైన సెక్యులర్ అవుతారని ఆయన వెల్లడించారు.  

బీజేపీ వైపు ఎగ్జిట్ పోల్స్

కాగా 2025  ఫిబ్రవరి 05వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని, అధికార ఆప్ వెనుకబడి ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

 

పీపుల్స్ పల్స్ అనే ప్రముఖ సంస్థ బీజేపీ ఏకంగా 51 నుంచి 60 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకే పరిమితం అవుతుందని తమ సర్వేలో వెల్లడించింది. అలాగే చాణక్య స్ట్రాటజీ, ఆపరేషన్ చాణక్య, పీపుల్ ఇన్‌సైట్, పీ మార్క్ లాటి పలు సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన మెజార్టీ ఇచ్చాయి. కేకే సర్వే మాత్రం ఆప్‌ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. 

 

 

Advertisment
Advertisment
Advertisment