Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ .. ఓటేసిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఓటు వేశారు.

New Update
delhi elections

delhi elections

Delhi assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..  సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం  1.56 కోట్ల మందికి పైగా ఓట్లర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మొదటి గంటలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన ప్రముఖులు

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నిర్మాణ్‌ భవన్‌లో ఓటు కాస్ట్ చేశారు.

దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి కాల్‌కాజీలోని పోలింగ్ కేంద్రంలో  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

సుష్మాస్వరాజ్‌ కుమార్తె , బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జన్‌పథ్‌లోని పోలింగ్ స్టేషన్‌లో  ఓటు వేశారు. 

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని మోతీ బాగ్‌ పోలింగ్ కేంద్రంలో  ఆయన సతీమణీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సెయింట్ జేవియర్స్ స్కూల్, రాజ్ నివాస్ మార్గ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు