Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఢిల్లీ పేలుడు, ఇతర వైట్‌కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మంది డాక్టర్లు ఆచూకీ లేకుండా పోయారు.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్‌తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.
ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం హాట్ టాఫిక్‌గా మారింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడం గమనార్హం.