Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.

New Update
delhi blast

delhi blast

ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడులో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది. ఆత్మహత్య బాంబర్‌కు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిని ఏజెన్సీ అరెస్టు చేసింది. అమీర్ రషీద్ అలీ జమ్మూ కాశ్మీర్‌లోని సాంబురా, పాంపోర్‌కు చెందినవాడు. పేలుడుకు ఉపయోగించిన వాహనాన్ని కొని, దానిని IEDగా మార్చడంలో అతను బాంబర్‌తో కలిసి కుట్ర పన్నినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. చనిపోయిన డ్రైవర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!

పూర్తి దర్యాప్తు..

అతను ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పుల్వామా జిల్లా నివాసి. నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా NIA స్వాధీనం చేసుకుంది. డాక్టర్ రెహాన్, డాక్టర్ మొహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా గతంలో ఉమర్‌తో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ, గాయపడిన వారిలో చాలామందితో సహా 73 మంది సాక్షులను ఏజెన్సీ ఇప్పటివరకు విచారించింది. ఈ కేసులో అసలు కుట్రదారులు ఎవరు, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఏమైనా ఉందా అనే దానిపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది.

ఇది కూడా చూడండి: Gen Z protest : మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్‌ జెడ్ నిరసన....100 మందికి పైగా..

Advertisment
తాజా కథనాలు