/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t093602554-2025-11-17-09-36-27.jpg)
High tension.. 15 more 'aggressive' doctors.. missing after Red Fort blasts!
Delhi Blast : ఢిల్లీ పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ పేలుడుతోపాటు ఇతర వైట్‌కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మందికి పైగా డాక్టర్లు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పో యారని పోలీసు వర్గాలు గుర్తించాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా, కశ్మీరు తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న 200 మంది వైద్యుల కదలికలపైనా దర్యాప్తు సంస్థలు నిఘా ఉంచాయి. అయితే వారిలో 15 మిస్ అయినట్లు తెలుస్తోంది. అదే- సమయంలో ఉగ్రవాద చర్యలకు డెన్‌గా మారిన అల్‌ఫలా యూనివర్సి టీ ల్యాబ్‌లోనే అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థం తయారైందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
పాక్ ఉగ్రవాద నేత మసూద్ అజర్ సోదరి నాయకత్వంలో లఖ్‌నవూ డాక్టర్ షాహిన్ సయీద్ ఈ కార్యక్రమాలకు సారథ్యం వహించిందని తెలుస్తోంది. కాగా, ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకి కారణమైన ఐ20 కారును నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. అంతేకాక పోలీసులు అతడితో సంబంధము న్న ఐదుగురు డాక్టర్లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో వారితో కలిసి చదువుకున్న, పని చేసిన వైద్యులపైనా పోలీసులు దృష్టి సారించారు. అందలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న ప్రియాంక శర్మ అనే డాక్టర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన డాక్టర్ అదీల్‌కు ప్రియాంక శర్మ తో పరిచయం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అదీల్ మాజీ ఉద్యోగి. ఆయన కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రియాంక శర్మను గుర్తించారు. హరియాణాలోని రోహ్‌టక్‌కు చెందిన ప్రియాంక శర్మను అనంత్‌నాగ్‌లో ఆమె నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ అనంతరం విడుదల చేశారు.
నబీ సహచరుడి అరెస్టు
మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుకు గురైన ఐ20 కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ సహచరుడు అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు గురైన ఐ20 కారు రషీద్ అలీ పేరు మీదే రిజిస్ట్రేషన్ అయిందని అధికారుల తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని పంపోరేకు చెందిన రషీద్... కారు కొనుగోలు విషయంలో నబీకి సహకరించేందుకు ఢిల్లీకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎర్రకోట సమీపంలో అదే కారు పేలిందని తెలిపారు. ఇక, డాక్టర్ ఉమర్ నబీకి అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షల నగదు అందినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి పలువురు హవాలా డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నబీ నగదు రూపంలో చెల్లింపులు చేసి హరియాణాలోని నుహ్‌లో పెద్ద ఎత్తున ఎరువులు కొనుగోలు చేసినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఇదిలా ఉండగా వైట్ కాలర్ ఉగ్రవాదం ఆరోపణలపై పోలీసులు తన కుమారుడు, సోదరుడిని అరెస్టు చేయడంతో మనస్తాపం చెంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ వ్యాపారి ఆదివారం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన బిలాల్ అహ్మద్ వానీ(50) అనే వ్యాపారి శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిపాలైన బిలాల్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్.. కేరళలో కొత్త వైరస్
Follow Us