CP Anand: ముట్టుకున్నా ఊరుకోం.. బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్!
సినీ సెలబ్రిటీల బౌన్సర్లు, ప్రైవేట్ బాడీగార్డ్స్కు సీపీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులుపెట్టి జైలులో ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీలపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.