CP Anand: సినీ సెలబ్రిటీల బౌన్సర్లు, ప్రైవేట్ బాడీగార్డ్స్‌కు సీపీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులుపెట్టి జైలులో ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. బౌన్సర్లకైనా, ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని, అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయని చెప్పారు. బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్‌ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలకు కూడా హచ్చరికలు పంపించారు. సామాన్య ప్రజలపై దాడులు సహించబోమని, బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హెచ్చరించిన హైదరాబాద్ సీపీ @CPHydCity సామాన్యప్రజలపై దాడులు సహించబోము. బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. @CVAnandIPS #TelanganaPolice pic.twitter.com/mfor76UYii — Telangana Police (@TelanganaCOPs) December 22, 2024 పబ్లిక్ ను టచ్ చేస్తే తాటా తీస్తాం.. ఈ మేరకు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై మీడియాతో మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్.. మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లను తోసేసిన, వారిపై చెయ్యి వేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాగే పబ్లిక్‌ను పక్కకు తోసేసినా తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఏదైనా ఇష్యూ జరిగితే బౌన్సర్ల బాధ్యత ఆ ఏజెన్సీస్‌తో పాటు బౌన్సర్లను నియమించుకున్న వీఐపీపైన కూడా ఉంటుంది. బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్‌గా వెళ్తాం. మాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: Jr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్ బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదు.బౌన్సర్లకైనా,ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయి. అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయి.#Bouncers #PrivateBodyGuards #TGPolice pic.twitter.com/1T3o0W4cNB — Telangana Police (@TelanganaCOPs) December 22, 2024