Indra: ‘ఇంద్ర’ సీన్ రిపీట్!.. బంగారాన్ని డబుల్ చేస్తానంటూ మోసం
బంగారాన్ని రెట్టింపు చేస్తానంటూ మోసగించిన ఉదంతం హైదరాబాద్ లో బయటపడింది. ముందుగా కొన్ని రూ. ఐదు వందల నోట్లను రెట్టింపు చేసినట్లు నమ్మించడంతో, ఈసారి బంగారాన్ని కూడా ముట్టజెప్పి డబుల్ చేసి ఇవ్వమన్నాడు బాధితుడు. చివరికి మోసపోయినట్లు గ్రహించి పోలీసుల వద్దకు పరుగెత్తాడు.