యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే?

కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ డీజే సౌండ్ బాక్సుల వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

డీజే సౌండ్.. పెళ్లిలో అయినా.. ఉత్సవాల్లో అయినా ఊపు రావాలంటే డీజే ఉండాల్సిందే. ఏ చిన్న ఫంక్షన్‌కైనా డీజే కచ్చితంగా పెట్టాల్సిందే. లేకపోతే ఊపురాదు. అంతా నిద్రపోతారు. అదే డీజే పెట్టి సాంగ్ వేస్తే ఆ కిక్కే వేరంటారు కొందరు. అయితే డీజే వల్ల ఎంత ఊపు వస్తుందో.. అంత ప్రమాదం కూడా. గతంలో డీజే సౌండ్ బాక్సుల ముందు డ్యాన్స్ వేస్తు ఎంతో మంది మృతి చెందారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అదే తరహాలో ఇప్పుడు మరో ఘటన జరిగింది. 

డీజే సౌండ్‌కి యువకుడు మృతి

కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ముగింపు ఊరేగింపు కోసం నిర్వాహకులు పోలీసుల అనుమతితో డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు ప్రారంభమైంది. 

ఇది కూడా చదవండి: ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం

స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు మొదలైంది. అలా మొదలైన సమయంలో యువకులు డీజే సౌండ్ బాక్సుల వద్ద డాన్సులు వేశారు. అంతా డాన్సులు వేస్తూ ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో ఓ యువకుడు డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

ఇది కూడా చదవండి: బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే!

దీంతో వెంటనే సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ యువకుడు అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ (21) గా గుర్తించారు. ఈ దసరా ఉత్సవాల్లో వినయ్ గుండెపోటుతో మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. డీజే సౌండ్ బాక్సులకు అతి దగ్గరగా డాన్స్‌లు చేయడంతో హార్ట్‌ బీట్ పెరిగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు కొందరు భావిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు