ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. తర్వాత ఏమైందంటే? హైదరాబాద్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మహిళపై ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన శశికిరణ్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇస్తానని చెప్పి మధురానగర్‌లో తన రూమ్‌కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 29 Sep 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మధురానగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ అసిస్టెంట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తోంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో శశికిరణ్‌రెడ్డి పరిచయం అయ్యాడు. సొంతంగా తనకి మూవీ కార్యాలయం ఉందని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మధురానగర్‌లో తన ఇంటికి రావాలని శశికిరణ్‌రెడ్డి చెప్పాడు. దీంతో ఆ మహిళ అక్కడికి వెళ్లగా ఆమెపై శశికిరణ్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏదో విధంగా ఆ గది నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని ఆ బిల్డింగ్‌లోని వారికి చెప్పడంతో వారు పోలీసులకు కాల్ చేసి చెప్పారు. భాదితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి: AP: ఏపీకి తిరిగి వస్తున్న లులూ మాల్...ఎక్కడేక్కడంటే! #crime-news #hyderabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి