పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి! AP: బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. By V.J Reddy 20 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Badvel: కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలిక మృతితో రామాంజనేయ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ అసలేం జరిగింది... ఇది కూడా చూడండి: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్ కంపెనీ సమీపంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏకంగా ఐదుగురు నిందుతులు బాలికపై అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత అటవీ ప్రాంతంలో విద్యార్థినికి నిప్పంటించారు. దీంతో వెంటనే ఆ బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. వెంటనే విద్యార్థినిని చికిత్స నిమిత్తం బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆ బాలిక బద్వేల్ సమీపంలోని దస్తగిరెమ్మ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ యువతి మృతి చెందింది. ఇది కూడా చదవండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు ఏపీ సీఎం చంద్రబాబు ఆరా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గోపవరం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది కూడా చూడండి: Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత #ap-news #crime-news #kadapa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి