Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం
హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.