T20 world Cup: టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్? ఉగాండా ప్లేయర్‌తో మంతనాలు
అమెరికా, వెస్ట్ ఇండీస్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అలజడి రేగింది. కెన్యా నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ప్లేయర్‌ను సంప్రదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది.