శ్రీవిష్ణు స్టేట్ క్రికెట్ ప్లేయర్ అనే విషయం మీకు తెలుసా? క్రికెట్ వదిలి మరీ సినిమాల్లోకి

శ్రీవిష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు.' అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్ కు ఆడేవాడు. నేను ఆంధ్ర తరపున స్టేట్ లెవల్లో అండర్ 19 ఆడాను' అంటూ తెలిపాడు.

New Update
sri vishnu

టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో శ్రీవిష్ణు ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, ఆ తర్వాత హీరోగా మారాడు. విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా సామజవరగమన, ఓమ్ భీం బుష్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని.. ఇప్పుడు 'స్వాగ్' తో హ్యాట్రిక్ పై కన్నేశాడు. హసిత్ గోలి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 4 న రిలీజ్ కాబోతుంది. 

ఆంధ్ర స్టేట్ ప్లేయర్..

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు తన గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు." సచిన్ ప్రేరణతో క్రికెట్ లోకి వెళ్ళాను. నేను ఆంధ్ర తరపున స్టేట్ లెవల్లో అండర్ 19 ఆడాను. అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్ కు ఆడేవాడు. అప్పుడు రాయుడు గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళము. 

టీమ్ లో అందరూ రాయుడు బాగా ఆడతాడు అంట, రాయుడు సూపర్ ప్లేయర్ అని అనుకునేవాళ్లం. అంబటి రాయుడు నెక్స్ట్ సచిన్ అవుతాడు అని అప్పట్లో మా టీమ్ లో అంతా అనుకునేవాళ్లం" అంటూ తెలిపాడు. దీంతో శ్రీవిష్ణు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 'స్వాగ్' విషయానికొస్తే.. 'రాజ రాజ చోర' సినిమాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కింది. 

శ్రీవిష్ణుతో పాటూ రీతూ వర్మ, దక్షా నగార్కర్, మీరా జాస్మిన్ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీవిష్ణు ఫస్ట్ టైం నాలుగు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. 

Also Read :  ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు