CM Revanth Reddy : సీఎం రేవంత్ తో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ
TG: రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై వారు చర్చించారు.
TG: రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై వారు చర్చించారు.
కొత్తగూడం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకీ ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్కు కామ్రేడ్లు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తమకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ను సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేయగా.. దీనికి కాంగ్రెస్ నో చెప్పినట్లు సమాచారం. దీంతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో కామ్రేడ్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఖమ్మం MP టికెట్ను సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి కాంగ్రెస్లో ఇదే టికెట్ కొరకు పోటీ పడుతున్నారు. మరి వీరిని కాదని కామ్రేడ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అనేది చూడాలి.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆయన లోక్సభ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో చర్చించామన్నారు.
తెలుగు బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండడాన్ని ఏమంటారు అంటూ మండిపడ్డారు నారాయణ.
ఈ ఎన్నికల్లో సీపీఐ కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని.. తాను గెలుస్తానంటున్నారు కూనంనేని.
ఎట్టకేలకు సీపీఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది. సీపీఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చిందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది.