D. Raja: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆయన లోక్‌సభ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో చర్చించామన్నారు. By B Aravind 04 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలా ఆయన ప్రసంగించారు. ' ముడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఎలా సిద్ధం కావాలో చర్చించాం. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తా అంటున్నారు. కానీ గత పదేళ్లలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల నుంచి బ్లాక్ మనీ వెనక్కి తీసుకురావడం ఎక్కడికి పోయాయి ?. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏమీ లేదు. Also Read: తాపీ మేస్త్రీకి 4.30లక్షల జీతం..పర్మినెంట్ ఉద్యోగం..అప్లయ్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఫిబ్రవరి 16న వాణిజ్య, రైతు సంఘాలు నిర్వహించే బంద్‌కు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మా పూర్తి మద్దతు ఇస్తాం. బీజేపీ హఠావో దేశ్ బచావో అని తొలిసారిగా చెప్పిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీలో చేరారు. ఇండియా కూటమిని మోసం చేసిన నితీశ్.. చరిత్రలో చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంటుంది. రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చర్చలు జరుపుతున్నాం దేశవ్యాప్తంగా సముచిత స్థానంలో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఇండియా కూటమితో చర్చిస్తున్నాం. ఇందుకు సంబంధించిన కమిటీ కూడా వేశాం. వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డ సీఎం జగన్ లాంటి వారు సురక్షితంగా ఉన్నారు. మరోవైపు ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రస్తుతం ఈడీ విచారణలో ఉన్నారు. ఇందుకు బీజేపీనే కారణం అని' డి. రాజా అన్నారు. Also read: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్ #cpi #telugu-news #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి