EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఎలక్షన్ రూల్స్‌లో ఈసీ చేసిన మార్పులపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.