గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Minister Seethakka | RTV
గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Telangana State Minister Seethakka announces good news for Tribal People and their welfare, Land Rights and Reservations | RTV
గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Telangana State Minister Seethakka announces good news for Tribal People and their welfare, Land Rights and Reservations | RTV
ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తామని పేర్కొన్నారు.
ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క స్వగ్రామమైన జగ్గన్నపేటకు ఇంతవరకు ఆర్టీసీ బస్సు వెళ్లేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమె స్వగ్రామానికి బస్సు రానుంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. త్వరలో బస్సు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే అందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్ఠానంపై ఉంది.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు తనను చాలా ఇబ్బందికి గురి చేశారని అన్నారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ములుగు ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ సీతక్క బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జీరో అవర్ లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నా.. అవకాశం ఇవ్వకపోతే మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని..