మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం..మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తామని పేర్కొన్నారు.

New Update
Seethakka

రాబోయే ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా, సమర్థంగా ఉన్నప్పుడే కుటుంబం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పీపుల్‌ ప్లాజాలో ఆమె సరస్‌ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. '' 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్స్‌ కుట్టే పనిని మహిళా గ్రూప్‌లకే అప్పగించాం. రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తామని'' సీతక్క అన్నారు. ఇదిలాఉండగా సరస్‌ ఫెయిర్‌ అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారుచేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది మహిళల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు