Chicken Price: ఎండాకాలం షురూ అయితే చికెన్, కోడిగుడ్డు ధరలు తగ్గుతుంటాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎండలతో పోటీ పడుతున్నాయి చికెన్ ధరలు. నాలుగైదు రోజుల క్రితం కిలో 150 రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. కిలో రూ. 300లు దాటింది. సామాన్యులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ధర ఒక్కసారిగా పెరగడంతో కొనేందుకు జంకుతున్నారు. దీంతో వ్యాపారులు కిలో ధరను కాస్త తగ్గించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్కిన్ లెస్, చికెన్ కిలో ధర రూ. 180 నుంచి 200 వరకు ఉంది. లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 వరకు ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతోపాటుగా మేడారం జాతర నేపథ్యంలె కోళ్ల సరఫరా భారీగా పడిపోయింది.
పూర్తిగా చదవండి..Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ట్రిపుల్ సెంచరీ దాటిన కిలో చికెన్ ధర.!
హైదరాబాద్ లో చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. నాలుగైదు రోజుల వరకు కిలో చికెన్ ధర 125-150రూపాయలు ఉంటే..ఇఫ్పుడు ఏకంగా రూ. 300 చేరుకుంది. చికెన్ కొందామంటే జంకుతున్నారు నగరవాసులు.పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే చికెన్ ధరలు భారీ పెరిగాయంటున్నారు వ్యాపారులు.
Translate this News: