Encounter: ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!
ఛత్తీస్ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.