Chandrababu: చంద్రబాబు ఇంటికి పోలీసులు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 160 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 160 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు.
తెలంగాణ అవిర్భవ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ నేత నోముల మాణిక్యాలరావు కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన చంద్రబాబు స్వదేశానికి వచ్చారు. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భధ్రత మరింత పెంచింది. రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించింది. టీడీపీ ఆఫీసు, కరకట్టలో చంద్రబాబు ఇళ్లు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కరకట్ట మార్గంతోపాటు చంద్రబాబు పయనించే తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఏపీ ఎన్నికల పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి X వేదికగా ధన్యవాదములు తెలిపారు. ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. ఆ ట్వీట్స్ లో వారు ఏమన్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే.
ఏపీలో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వంద శాతం కాదు.. వేయి శాతం తాము గెలుస్తామన్నారు. జగన్ ఓ సైకో, శాడిస్ట్, విధ్వంసకుడని.. ఆయనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.