హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతర్ని చంపిన తండ్రి కన్న తండ్రే కూతర్ని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో చోటు చేసుకుంది. కూతురు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లిన తండ్రి పాపను పెద్ద అంబర్‌పేట ఓ ఆర్‌ఆర్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. By Karthik 19 Aug 2023 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతుర్ని హత్య చేశాడు. బీహెచ్‌ఈఎల్‌లోని జ్యోతి స్కూల్‌ల్లో మోక్షగ్న (9) నాలుగో తరగతి చదువుతుంది. పాప ఎప్పటిలాగే శనివారం సైతం స్కూల్‌కు వెళ్లింది. ప్లాన్ ప్రకారమే బాలిక తండ్రి చంద్రశేఖర్ స్కూల్‌కు వెళ్లాడు. పాపకు మాయ మాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. చందానగర్ సమీపంలోకి తీసుకెళ్లి బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. అదే సమయంలో పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో నిందితుడు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రమాద సమీపంలో చిన్నారి రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహం పక్కనే ఉన్న నిందితుడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. చంద్రశేఖర్‌కు తన భార్య హిమతో మనస్పర్దలు రావడంతో కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. పాప మోక్షగ్న మాత్రం అప్పుడప్పుడు తండ్రిని చూడటానికి వెళ్లుతుండేదని పోలీసులు తెలిపారు. భార్య మీద కొంపతోనే బాలికను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి చదవుతున్న స్కూల్‌కు వెళ్లిన నిందితుడు.. సిబ్బంది పర్మిషన్‌తోనే పాపను తీసుకెళ్లాడా లేక ఏవరికీ చెప్పకుండా తీసుకెళ్లాడా.? ఒకవేళ సిబ్బందికి చెబితే వాళ్లు తల్లికి ఫోన్ చేసి చెప్పారా లేదా అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #mokshagna #hima #hyderabad #chandanagar #killed #chandrasekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి