Bus Accident: ప్రైవేట్‌ స్కూల్ బస్సులో మంటలు.. డ్రైవర్‌తో సహా 30 మంది విద్యార్థులు?

అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

New Update
bus fire accident

bus fire accident

ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రావెల్స్ వాహనాలు దగ్ధమవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో మంటలు ఏర్పడిన వెంటనే 30 మంది విద్యార్థులను స్కూల్ బస్సు నుంచి దించేశారు. అయితే బస్సు నడుపుతున్న సమయంలో గేర్ బాక్స్‌లో ఏదో లోపం ఉండటం వల్ల ఒక్కసారిగా వింత శబ్ధాలు వచ్చాయి. దీంతో డ్రైవర్ వెంటనే ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆలస్యం చేయకుండా విద్యార్థులను దించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు