బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్.. ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపు

BRS నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కవిత, హరీశ్ రావుతోపాటు హైదరాబాద్ BRS ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

New Update
house arrest

బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లను డిసెంబర్ 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహం ముందు దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పార్టీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కవిత ఇంటిముందు భారీగా పోలీసులు మోహరించారు. హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, కేపీ వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  మోండా మార్కెట్ టకారా బస్తీలోని నివాసంలో మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‎ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పద్మారావు గౌడ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను సెక్యూరిటీగా ఉంచారు. 

బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్, నిర్బంధాలను హరీశ్ రావు ఖండించారు. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా తమ నేతలు నివాళులు అర్పించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఎక్స్ లో ట్విట్ చేశారు. నిర్భందాలు నిరంకుశ పాలనకు నిలువుటద్దమని పేర్కొన్నారు. ఓ వైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం.. మరో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

అటు బీఆర్ఎస్ నేతల ఆందోళనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అంబేడ్కర్ విగ్రహాల దగ్గర రాజకీయం సరికాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని.. సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పొన్నం అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు