Bollywood: రహస్యంగా వివాహం చేసుకున్న తాప్సీ !
బాలీవుడ్ భామ తాప్సీ పన్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. గత 10 సంవత్సరాలు గా డేటింగ్ చేస్తున్న మథియాస్ బోతోను మార్చి 23న వివాహం చేసుకుంది.
బాలీవుడ్ భామ తాప్సీ పన్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. గత 10 సంవత్సరాలు గా డేటింగ్ చేస్తున్న మథియాస్ బోతోను మార్చి 23న వివాహం చేసుకుంది.
బాలీవుడ్ మల్టీస్టారర్ అయినటువంటి వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో తారక్ ఇండియన్ గూఢచారిగా కనిపించబోతున్నట్లు పక్కా సమాచారం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ను రైటర్ ఆదిత్య చోప్రా డిజైన్ చేశారని టాక్.
కంగనా రనౌత్ తాను లతా మంగేష్కర్ లా ఉండాలి అనుకుంటున్నట్లు తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పెళ్లిళ్లలో వేదికల మీద డ్యాన్స్ లు చేయను అంటూ రాసుకొచ్చింది. గతంలో లతా మంగేష్కర్ కూడా ఇలాగే చెప్పారు.
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ స్టార్ రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధంచడం పై చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్లు జామ్ నగర్ చేరుకున్నారు. బాలీవుడ్ నుంచి రణ్ వీర్ సింగ్, దీపికా పడుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ, అర్జున్ కపూర్, అలియాభట్, రణబీర్, సందడి చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో '' అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్లకు నేను వీరాభిమానిని. వారిద్దరితో కలిసి ఏదోక రోజూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు... ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు టైగర్ ష్రాఫ్ తెలిపాడు.
ప్రముఖ గాయని మల్లికా రాజ్పుత్ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు
‘యానిమల్’మూవీ విమర్శలపై భూమి పెడ్నేకర్ స్పందించింది. ‘పురుషాధిక్యత గురించి మాట్లాడటం నాకు నచ్చదు. స్త్రీలను కించపరిస్తే భరించను. కళాకారులకు విశాల దృక్పధం అవసరం. సందీప్ వంగా అద్భుతంగా తెరకెక్కించాడు’ అంటూ మూవీ టీమ్ ను పొగిడేసింది.
80, 90ల్లో బాలీవుడ్లో ఓ ఊపు ఊపిన మాస్ హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యారు. గుండెనొప్పితో ఆయన ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.