Bollywood: 48 ఏళ్ల ప్రముఖ సినీ సెలబ్రిటీ.. ఇంకా పెళ్లి కాలేదు కానీ తల్లయింది..! By Durga Rao 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత ఏక్తా కపూర్ వయసు 48 ఏళ్లు. కానీ ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటున్నారు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకులు, నిర్మాతలలో ఏక్తా కపూర్ ఒకరు. బాలీవుడ్‌లోని ప్రతి పెద్ద నటుడు కూడా ఆమెతో పనిచేయాలని కోరుకుంటారు.ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అయిన ఏక్తా కపూర్ ఇప్పటికీ పెళ్లికాని అమ్మాయిగానే మిగిలిపోయారు. వివాహం చేసుకోనప్పటికీ.. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. సరోగసీ ద్వారా బిడ్డను కన్నారు. అయితే ఒక్కోసారి ఆమె పెళ్లికి సిద్ధమైనప్పటికీ ..అది సాధ్యం కాలేదు. అప్పటి నుంచీ సింగిల్‌నే ఉంటున్నారు. ఏక్తా కపూర్ కంటే ముందు ఆమె సోదరుడు తుషార్ కపూర్ సరోగసీ ద్వారా తండ్రి అయ్యాడు. తుషార్ తన కుమారుడికి లక్ష్య అని పేరు పెట్టారు. ప్రస్తుతం లక్ష్య బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ స్టార్ కిడ్. అదే సమయంలో తుషార్ తర్వాత ఆయన సోదరి, నిర్మాత ఏక్తా కపూర్ కూడా తల్లి అయ్యారు.స్పాట్ బాయ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు ఏక్తాకపూర్. ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడుతూ.. పెళ్లైన తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు తమ భాగస్వాముల నుంచి విడిపోయారని చెప్పారు. ఇప్పుడు అందరూ అవివాహితులే అని సరదాగా చెప్పారు. తాను ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు చూశానని.. అందుకే పెళ్లి చేసుకోవడానికి తొందరపడనని స్పష్టం చేశారు. కానీ తనకు పిల్లలంటే ఇష్టమని చెప్పారు. కానీ వివాహం గురించి ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదని తెగేసి చెప్పారు ఏక్తా కపూర్.తాను బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతానని ఏక్తా కపూర్ పేర్కొన్నారు. తనకు పగటి పూట సమయం చాలా తక్కువగా ఉంటుందని… ఆ సమయాన్ని స్పాలో గడిపి రిలాక్స్ అవుతానని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడమంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.ఏక్తా కపూర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. 2019లో సరోగసీ ద్వారా ఆమె మగబిడ్డకు తల్లి అయ్యారు. ఏక్తా కపూర్.. తన కుమారుడికి రవి అని పేరు పెట్టారు. అతడి ఫోటోలను ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు. #bollywood #celebrity-ekta-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి