'దేవర' లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్
'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
బాలీవుడ్ హీరోయిన్ అభా రత్నా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడేవారని, కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని అనేవారు కానీ అది ఆడిషన్ కాదని ముందే చెప్పేవాళ్ళని తెలిపింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. నవ్విస్తూ ఉండాలి, నేను ఏడిస్తే పక్కనే ఉంది దైర్యం చెప్పాలి. నా కలలను తన కలలుగా భావించేవాడు భర్తగా రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఇండియా తరుపున పార్టిసిపేట్ చేసేందుకు ఐశ్వర్య రాయ్ తన కూతురితో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐశ్వర్య తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ తో కనిపించింది. ఇదికాస్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ని బయటపెట్టింది. తనకి కాబోయే భర్త ఎంతో నిజాయితీగా ఉండాలని. తనను నవ్వించాలని, తనను, తన పనిని గౌరవించాలని, తనతో ఎక్కువ టైం గడపాలని, అన్నిటికంటే ముఖ్యమైంది తనను బాగా చూసుకోవాలని చెప్పింది.
నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'రామాయణం'. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. రామాయణం చిత్రంలో కైకేయి పాత్రలో నటి లారా దత్తా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నటి అనన్యాపాండే సంపాదన, ప్రేమ వ్యవహారంపై తండ్రి చుంకీ పాండే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నా కూతురు నా కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేసిన తప్పేమీ లేదు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం’ అన్నాడు.
'సింగమ్ అగైన్' మూవీనుంచి దీపికా పదుకొణె నయా లుక్ రిలీజ్ చేశారు దర్శకుడు రోహిత్ శెట్టి. ‘రీల్ అయినా...రియల్ అయినా... ఈమె నా హీరో. లేడీ సింగమ్’ అంటూ దీపిక పోలీస్ దుస్తుల్లో గుండాలను చెదరగొడుతున్నట్లు చూపించారు. పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా ట్రోలింగ్ పై అనన్యాపాండే స్పందించింది. హీరోయిన్లు స్నేహంగా ఉండటాన్ని కొంతమంది తప్పుగా భావిస్తున్నారు. సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.