Triptii Dimri : 'యానిమల్' బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే? 'యానిమల్' సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రిప్తి దిమ్రి 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది. ఈ డ్రెస్ ఖరీదు 4 లక్షలకు పైగా ఉంది. By Anil Kumar 30 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Animal Actress Triptii Dimri : బాలీవుడ్ (Bollywood) స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి పై కూడా అంతే బజ్ నడిచింది. జోయా పాత్రలో ఆకట్టుకున్న త్రిప్తి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. సినిమాలో హీరోయిన్ కంటే కూడా ఈ బ్యూటీ ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. యానిమల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రిప్తి (Triptii Dimri).. ఇప్పుడు కుర్రాళ్ళ నేషనల్ క్రష్ గా మారింది. యానిమల్ (Animal) తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.అందులో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమా కూడా ఒకటి. ఈ మూవీలో త్రిప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ హాజరయ్యారు. Also Read : ‘కల్కి’ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ! అన్ని లక్షలా..? అందరిలోనూ స్పెషల్‌గా ఉండాలని ఆరాటపడే తృప్తి ఈ ఈవెంట్‌లోనూ అందంగా ముస్తాబై సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది. పొట్టి డ్రెస్ కనిపించి కనువిందు చేసింది. మోకాలిపై వరకే ఉన్న ఈ బ్లాక్ డ్రెస్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. వెర్సేస్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ మినీడ్రెస్ ఏకంగా రూ.4,06,234 (4 లక్షలకు పైగా) ఉంది. దీని ధర చూసిన నెటిజన్లు..'ఈ పొట్టి డ్రెస్ కి 4 లక్షలా' అంటూ షాక్ కు గురవుతున్నారు. #triptii-dimri #bollywood-actress #animal-actress-triptti-dimri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి