Kriti Sanon : కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలంటున్న 'ఆదిపురుష్' బ్యూటీ! కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ని బయటపెట్టింది. తనకి కాబోయే భర్త ఎంతో నిజాయితీగా ఉండాలని. తనను నవ్వించాలని, తనను, తన పనిని గౌరవించాలని, తనతో ఎక్కువ టైం గడపాలని, అన్నిటికంటే ముఖ్యమైంది తనను బాగా చూసుకోవాలని చెప్పింది. By Anil Kumar 11 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kriti Sanon About Her Life Partner : బాలీవుడ్(Bollywood) బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు(Mahesh Babu) సరసన 'వన్' నేనొక్కడినే సినిమాతో సినీ పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పలు విజయాలు అందుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ మధ్య నిర్మాతగానూ మారిన కృతి సనన్ తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్ కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Also Read : పవన్ గెలిస్తే గుండు కొట్టించుకుంటానన్న హీరోయిన్.. రెడీగా ఉండమంటున్న ఫ్యాన్స్! కాబోయే భర్త అలా ఉండాలి కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ని బయటపెట్టింది." ఏ విషయం లో అయినా మనం ఆశ పెట్టుకుంటే కచ్చితంగా ఒత్తిడికి లోనవుతాం. అందుకే నేను దేనిపై పెద్దగా ఆశ పెట్టుకోను. లైఫ్ లో ఏదీ జరిగినా స్వీకరిస్తాను. ఇక నాకు కాబోయే భర్త విషయానికొస్తే.. అతను ఎంతో నిజాయితీగా ఉండాలి. నన్ను నవ్వించాలి, నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైం గడపాలి. అన్నిటికంటే ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని అన్ని విషయాల్లో నాతో సరితూగాలనే కోరిక(Desire) నాకు లేదు" అని చెప్పింది. దీంతో కృతి సనన్ కాబోయే భర్త గురించి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కృతిసనన్ గత కొంతకాలంగా లండన్ కి చెందిన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో బయటికి రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిపై మాత్రం కృతిసనన్ స్పందించలేదు. #kriti-sanon-life-partner #mahesh-babu #kriti-sanon #bollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి