Vizag Steel Palnt: స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు రెండు నెలల్లో మరోసారి సమావేశం కానున్నారు.