Haryana Results: బీజేపీకి కలిసొచ్చిన కాంగ్రెస్ మిస్టేక్స్.. కమలం గెలుపునకు 3 ప్రధాన కారణాలివే! హర్యానాలో మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ గెలవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 | నవీకరించబడింది పై 08 Oct 2024 13:30 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Haryana Assembly Elections: దేశంలో అత్యంత ఉత్కంఠ రేపిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తలకిందులయ్యాయి. మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. గత పదేళ్లుగా హర్యానాను పాలించిన కమలం పార్టీ వైపే మళ్లీ అక్కడి ప్రజలు మొగ్గుచూపారు. దీంతో హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. ప్రస్తుతం కమలం పార్టీ నేతలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీ గెలవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రూరల్ నియోజకవర్గాలపై ఫోకస్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆ తర్వాత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు రచించింది. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఎందుకంటే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గ ప్రాంతాల్లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయా ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) కూడా బీజేపీకి మద్దతుగా నిలిచింది. సెప్టెంబర్ నుంచి ఆర్ఎస్‌ఎస్.. రూరల్ ఓటర్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతీ జిల్లాకు కూడా 150 మంది వాలంటీర్లను మోహరించింది. ఈ వాలంటీర్లు.. ఓటర్లు, మండల కార్యకర్తలతో సమన్వయం అయ్యేలా వీరిని నియమించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పథకాల అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వాలంటీర్లది కీలక పాత్ర ఉంది. బీజేపీ వైపు నాన్ జాట్ - దళిత ఓటర్లు హర్యానాలో జాట్ అనే కమ్యూనిటికి మంచి బలం ఉంది. ఎన్నికల్లో వీళ్ల ఓట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈసారి మాత్రం జాత్ కమ్యూనిటీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ముందుగానే గ్రహించిన కమలం పార్టీ దళితుల మధ్య విభజనను పసిగట్టింది. జాట్‌యేతర ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నించింది. జాట్‌యేత ఓట్లరు (36 మంది బిరాదారీలు)లను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకున్న వారిపై ఇది ప్రభావం పడింది. అలాగే చీలిన దళిత ఓటర్లను కూడా ఆకర్షించగలిగింది. ఈ 36 బిరాదారీలతో కూడిన కులాలు, వర్గాల్లో బ్రాహ్మణులు, సునార్‌లు, సైనీలు, అహిర్లు, సైనీలు, రోర్స్, కుమ్హర్, గుర్జర్‌లు, జాట్‌లు, బనియాలు (అగర్వాల్‌లు), రాజ్‌పుత్‌లు, పంజాబీలు (హిందూ) ఉన్నారు. ఈ 36 మంది బిరాదారీలను తమవైపు మళ్లించేందుకు బీజేపీ వీళ్లకి రుణాలు ఇస్తామని.. భూ యజమాన్య హక్కులు కల్పిస్తామని హామీలు ఇచ్చింది. బీజేపీ హర్యానాలో అధికారంలోకి రావడానికి ఈ 36 మంది బిరాదారీల వర్గాలు కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో విభేదాలు హర్యానా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం విభేదాలు ఉన్నాయి. దళిత నేత, ఎంపీ కుమారి సెల్జా అలాగే మరొకరు భూపిందర్ సింగ్ హుడా మధ్య విభేదాలతో కాంగ్రెస్ రెండుగా చీలింది. ఈ ఇద్దరు నేతలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రయత్నించారు. అయినా కూడా విభేదాలు అలాగే ఉండిపోయాయి. ఎన్నికల ప్రచారాలకు కుమారి సెల్జా కూడా చాలాసార్లు దూరంగా ఉంది. ఇలా కాంగ్రెస్‌లో ఇలా విభేదాలు ఉండటం కూడా బీజేపీకి అనుకూల అంశంగా మారింది. ఈ అంశాలన్నీ కూడా బీజేపీకి ఓటింగ్ శాతం పెంచడంలో దోహదపడ్డాయి. #haryana #haryana assembly election 2024 #congress #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి