Israel: ఇజ్రాయెల్‌ లెక్క సరి చేసింది!

ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు.

New Update
nethanyuhu

Benjamin Netanyahu: పశ్చిమాసియాలో హమాస్‌ ఒక పవర్‌ ఫుల్‌ సంస్థ.... దాన్ని మించిన సంస్థ హెజ్బొల్లా. హమాస్‌ తో యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌ దానికి సపోర్ట్‌ చేస్తున్న హెజ్‌బొల్లా పై కూడా భారీ యుద్ధానికి తెరతీసింది. అందులో భాగంగానే ఇజ్రాయెల్‌ సైనికులు హెజ్‌బొల్లా చీఫ్‌ హస్సాన్‌ నస్రల్లాను చంపేశారు. 

దీనిపై మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు. లెబనాన్‌కి దక్షిణ, తూర్పు వైపున హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరపడంతో.. 64 ఏళ్ల నస్రల్లా ఈ దాడుల్లో మృతి చెందారు. ఈ ఆపరేషన్‌కి ముందు..  ఇజ్రాయెల్ పైకి.. ఒక గ్రూప్ రాకెట్లతో దాడి చేసింది. దాంతో.. ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. ఆ దేశానికి చెందిన జెట్ యుద్ధ విమానాలు.. రాత్రికి రాత్రి భారీగా దాడులు చేశాయి. బీరూట్ దక్షిణం బాంబు దాడులతో దద్దరిల్లింది. 

చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన  విజయంగా నెతన్యాహు అభివర్ణించారు. 1980లో బాంబు దాడులతోపాటూ.. ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ పౌరులపై దాడుల వెనక నస్రల్లా ఉన్నారని నెతన్యాహు అన్నారు.ఇది సరైన నిర్ణయం అన్నారు.ఇజ్రాయెల్ చాలా శక్తిమంతమైన దేశం. 

Also Read: నస్రల్లా హత్య న్యాయమైన చర్య: బైడెన్‌!

హెజ్బుల్లా అధినేత ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత  నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది.  ఎప్పటి నుంచి  నస్రల్లా మీద ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. చాలా కాలం నుంచి  బంకర్ల నుంచి బయటకు రావడం లేదు. ఎప్పుడూ కనిపించినా..వీడియోలు, టీవీలలోనే సందేశమిస్తారు. దాదాపు 32 ఏళ్ళుగా హెజ్బుల్లాని ఇతనే నడిపిస్తున్నారు. ఈ సంస్థను పెద్ద సాయుధదళంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు. బీరూట్‌లో పెద్ద పెద్ద భవనాల కింద ఉన్న సెల్లార్లలో ఉన్న బంకర్లలో నస్రల్లా ఉండేవారు.  వీటిని  ఏ బాంబులూ ఛేదించలేవు.  మరోవైపు ఇజ్రాయెల్ చాలా కాలంగా హెజ్‌బొల్లా టాప్‌ కమాండ్‌పై దృష్టిపెట్టింది. ఫహద్‌షుకుర్‌,  ఇబ్రహీం అకిల్‌..తదితరులను  వైమానిక దాడులతో చంపేసింది. దాంతో పాటూ నస్రల్లా మీద కూడా గట్టి నిఘా పెట్టింది. 

నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆయుధంగా వాడుకుంది. మరొకవైపు ఇజ్రాయెల నిఘా విభాగం లెబనాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సైన్యానికి అందించింది. బీరూట్‌లోని పెద్దభవనాల్లోని కింద ఉన్న సెల్లార్లలో ఆయన ఉంటారన్న సమాచారం ఇజ్రాయెల్‌ దగ్గర ఉంది. దీంతో సాధారణ బాంబులు ఛేదించలేని బంకర్ల కోసం ఇజ్రాయెల్ అమెరికా నుంచి బంకర్ బస్టర్ జీబీయూ 28ను రంగంలోకి దించింది. నిఘి వర్గాల సమాచారం ప్రకారం దీంతో బీరుట్ అపార్ట్‌మెంట్లపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఇందులో బాంబులు అపార్ట్‌మెంట్ల నేళమాళిగల్లోకి చొచ్చుకుపోయాయి. వీటల్లోనే నస్రల్లా మరణించారు. ఈ క్రమంలో ఆయన కూతురు కూడా మృతి చెందింది. హమాస్‌తో యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచీ ఇజ్రాయెల్ టెక్నాలజీని విపరీతంగా వాడుతోంది. ఈ టెక్నాలజీ సాయంతో నిఘావర్గాల సమాచారంతో లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడులు చేస్తోంది. ఐరన్‌డోమ్‌, క్షిపణులు, ఎఫ్‌-35 విమానాలు, డ్రోన్లు, నిఘాపరికరాలను సమకూర్చుకుని హమాస్, హెజబ్లులాల మీద విరుచుకుపడింది. నస్రుల్లా మరణంతో హెజ్బుల్లా దాదాపు నాశనం అయినట్టేనని వార్తలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు