బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి.. వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.