రోజొక్క తీరు.. రేపు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి

తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు 7వ రోజు అంటే వేపకాయల బతుకమ్మ. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

New Update
bathukamma 7th day

Bathukamma 7th day

Bathukamma 2024: తెలంగాణలో  బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతీ ఇల్లు ఆడపడుచులు, చిన్నారుల చిరునవ్వులు, బంధుమిత్రుల కోలాహలాలతో కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండగ వేడుకలను తొమ్మిది రోజుల పాటు కనుల పండువగా జరుపుకుంటారు. పెద్ద, చిన్నా తేడా లేకుండా బతుకమ్మను మధ్యలో పెట్టి ఆటపాటలతో సందడి చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ... అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తారు. 

ఏడో రోజు బతుకమ్మ ప్రత్యేకతలు 

తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీ దేవిని రోజుకో రూపంతో కొలుస్తారు. రోజుకో విధంగా బతుకమ్మను పేరుస్తూ.. ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. రేపు ఏడో రోజు.. ఈ రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తారు. ఏడో రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందారం, గుమ్మడి తీరొక్క పూలతో బతుకమ్మను ఏడు వరుసలుగా పేరుస్తారు. 

రోజుకో తీరు.. 

రోజొక్క తీరున బతుకమ్మను కొలుస్తారు. మొదటి రోజు:  ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు: అటుకుల బతుకమ్మ, మూడవ రోజు: ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు, నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు: అట్ల బతుకమ్మ, ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ ,  ఏడవ రోజు: వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు: వెన్నెల ముద్దల బతుకమ్మ,  తొమ్మిదవ రోజు: సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మను తొమ్మిది పేర్లతో పూజిస్తారు. 

Also Read:  5 వ రోజు అట్ల బతుకమ్మ.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి?

Advertisment
Advertisment
తాజా కథనాలు