Bathukamma: అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?

అలిగిన బతుకమ్మకు సంబంధించి కథ నుంచి ప్రచారంలో ఉంది. దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించారని, బండాసురుడిని, చండను సంహరించాక రాక్షస సంహారం చేసిన అమ్మవార్లు బాగా అలసిపోయారట.

New Update
bathukamma5

Bathukamma

Bathukamma 2024: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  చిన్నాపెద్దా అంతా కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ రకరాల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతున్నారు. ఐదు రోజులు రకరకాల నైవేద్యాలు పెట్టి తల్లిని కొలిచారు. ఒక్కో రోజు ఒక్కో పేరుతో మహిళలంతా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో ఆరోరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆటపాట కనిపించవు. రోజూలా బతుకమ్మను ఆడరు. ఎలాంటి కోలహలం కూడా ఎక్కడా కనిపించదు. ఆరో రోజును అలిగిన బతకమ్మ అంటారు. అలిగిన బతుకమ్మ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో చూద్దాం.

అలిగిన బతుకమ్మకు ప్రచారంలో ఓ కథ..

  • ఈ రోజు అమ్మవారు ఆకలితో ఉంటారని భక్తుల నమ్మకం. అమ్మవారిని అలకవీడమంటూ వేడుకుంటుంటారు మహిళలు. ఆశ్వయుజ పంచమి రోజున బతుకమ్మకి ఏ నైవేద్యం పెట్టరు. బతుకమ్మలు పేర్చి ఆడటం కూడా ఉండదు. పురాతన కాలంలో బతుకమ్మను తయారు చేస్తుండగా అనుకోకుండా ఒక మాంసపు ముద్ద తలగడంతో అపవిత్రం జరిగిందని చెబుతుంటారు. అందుకే ఆరో రోజు బతుకమ్మను కొలవరు. ఈ అలిగిన బతుకమ్మకు సంబంధించి ఒక కథ కూడా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

రాక్షసుల్ని సంహరించి...

  •  అదేంటంటే..  దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించారని,  బండాసురుడిని, చండను సంహరించాక రాక్షస సంహారం చేసిన అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. దీనికి మరో పేరు అర్రెం.. అలసిన బతుకమ్మ అని కూడా అంటారని పెద్దలు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి:  ఊబకాయం ఉంటే ఈ తీవ్రమైన వ్యాధులు తప్పవు

Advertisment
Advertisment
తాజా కథనాలు