బాహుబలి మళ్ళీ రాబోతున్నాడ..? | Bahubali | Re Release | 10 years for Bahubali | Prabhas | RTV
‘బాహుబలి’ సినిమాకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజా 'బాహుబలి' పార్ట్-3పై క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్ 3 ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయని చెప్పారు.
'బాహుబలి' లో భల్లాలదేవగా దగ్గుబాటి రానా అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందు హాలీవుడ్ స్టార్ హీరో ఫేమ్ జేసన్ మోమోవాను అనుకున్నారట. కానీ, అప్పటికే హాలీవుడ్లో బిజీగా ఉన్న జేసన్ మోమోవా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట.
అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.