/rtv/media/media_files/2025/07/11/bahubali-re-release-2025-07-11-11-59-53.jpg)
bahubali re release
పదేళ్ల కిందట విడుదలై ప్రభంజనం సృష్టించిన బాహుబలి..ఇప్పుడు మళ్ళీ రెండు పార్ట్ లను కలిపి ఒక్కటిగా చేసి విడుదల చేశారు. బాహుబలి ఎపిక్ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కూడా సెన్సేషన్ అవుతోంది. కొత్త వెర్షన్ ను ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు రెండు సినిమాల్లో లేని కొన్ని సీన్లను యాడ్ చేశారని..అవి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా బిజ్జలదేవ చెప్పే ఓ డైలాగ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొత్త సీన్స్..
బాహుబలి ఎపిక్ ఈ రోజు విడుదలైంది. ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కరిపిస్తోంది. రీ-ఎడిటెడ్ వెర్షన్‌లో కొత్త సీన్, అప్‌గ్రేడ్‌డ్ విజువల్స్, డాల్బీ ఆడియో ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. కొత్త సీన్స్ పై ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, సెంటిమెంట్‌తో మేళవించిన యాక్షన్ సన్నివేశాలు ఇప్పుడు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. భారీ సెట్‌లు, మహిష్మతి రాజ్య సౌందర్యం, ప్రభాస్ రాయల్ ప్రెజెన్స్ ఈ వెర్షన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోందని చెబుతున్నారు. రెండు పార్ట్ లను కలిపి రాజమౌళి బాహుబలి ఎపిక్ ను ప్రపంచ స్థాయి సినిమాగా మలిచారని ప్రశంసిస్తున్నారు. ఈ కొత్త సినిమాలో మహేంద్ర బాహుబలి మాషిష్మతి రాజ్యంలోకి అడుగుపెడుతున్న సీన్, దానికి అనుగుణంగా బిజ్జలదేవ చెప్పే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు.
Best scene asla😭🔥#BaahubaliTheEpicpic.twitter.com/La1K6L2HBk
— Satyá (@TheMovieBufffff) October 30, 2025
మహేంద్ర బాహుబలి బారి నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు మాహిష్మతి రాజ్యానికి చేరుకుని బాహుబలి (అమరేంద్ర బాహుబలి) బతికే ఉన్నాడని బిజ్జలదేవకి చెబుతాడు. దానికి బిజ్జల దేవుడు చచ్చినవాడు ఎలా బతికొస్తాడురా అంటాడు. లేదు ప్రభు నా కళ్లతో చూశాను. వాడు మనవాళ్లందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామే స్వయంగా విచ్చేసినట్లు అనిపించిందని సైనికుడు చెబుతాడు. అందుకు బిజ్జలదేవ కోపంతో ఊగిపోతూ సైనికుడిని తన్ని.. వాడు చచ్చాడురా.. నేనే చంపేశా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది. వాడి ప్రాణం ప్రాణహిత నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది. బాహుబలి చచ్చాడు.. చచ్చిపోయాడు’ అంటూ ఆవేశంగా మాట్లాడతాడు. ఈ డైలాగ్ నడుస్తున్నప్పుడు బాహుబలిగా ప్రభాస్ ఎంట్రీ ని చూపించారు. మొత్తం సీన్ కేక పుట్టించే విధంగా ఉంది.
Also Read: You sold a dream: ఆశపెట్టి.. తిరిగి లాగేసుకుంటున్నారు..జేడీ వాన్స్ పై తిరగబడ్డ భారత మహిళ
 Follow Us
 Follow Us