Viral Video : చిరునవ్వులు చిందిస్తూ అయోధ్య రాముడి దర్శనం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
అయోధ్యలో తన జన్మస్థలంలో రామ్లలా కొలువుదీరారు. బాలరాముడి విగ్రహ నమూనాతో కొందరు ఏఐ సాంకేతిక జోడించి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రామ్లలా నిజంగానే తమను చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.