Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.