Asaduddin Owaisi : ఆపరేషన్‌ సిందూర్‌... ఒవైసీ సంచలన ట్వీట్!

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ  జరిపిన సైనిక దాడులను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు.

New Update
owisi-sindoor

owisi-sindoor

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ  జరిపిన సైనిక దాడులను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. మరో పహల్గామ్ పునరావృతం కాకుండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం నేర్పించాలి.. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్  అంటూ  ఆయన ట్వీట్ చేశారు.  పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి  ఒవైసీ పాకిస్తాన్‌ను విమర్శిస్తూనే ఉన్నాడు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  

పహల్గామ్‌లో 26 మంది అమాయక టూరిస్టులను బలిగొన్న ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత సాయుధ దళాలు బుధవారం (మే 7) 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 90 మంది ఉగ్రవాదులు హతమమయ్యారు. పీవోకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేసింది.  

Advertisment
తాజా కథనాలు